TG-3949
Telugu

నీవే నా సంతోషగానము

Neeve Naa Santhosha Gaanamu

0
views
పల్లవి

నీవే నా సంతోషగానము రక్షణశృంగము మహాశైలము (2) బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా||

1వ చరణం

ఓ లార్డ్! యు బి ద సేవియర్ షో మి సం మెర్సీ బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ ఐ విల్ సరెండర్ యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2) నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా||

2వ చరణం

వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2) మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా||

3వ చరణం

నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు హీనశరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2) హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||