TG-3947
Telugu

నీవే నా ప్రాణం సర్

Neeve Naa Praanam Sarvam

23
views
పల్లవి

నీవే నా ప్రాణం సర్వం నీవే నా ధ్యానం గానం యేసయ్యా నీవే ఆధారం (2) నీవేగా నా ప్రాణం – యేసయ్యా నీవే జీవితం యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా.. హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2) ||నీవే||

1వ చరణం

నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది నీ రాకకే కదా నేనెదురు చూచునది (2) నీవలె ఉందును నీలో వసించెదను (2) అండా దండా కొండా నీవయ్యా నాకున్న లోకం అంతా నీవయ్యా అండా దండా కొండా నీవయ్యా నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా||

2వ చరణం

నా కాపరి నీవే నా ఊపిరి నీవే నా దారివి నీవే నా మాదిరి నీవే (2) నీవలె ఉందును నీ వెంట సాగెదను (2) అండా దండా కొండా నీవయ్యా నాకున్న లోకం అంతా నీవయ్యా అండా దండా కొండా నీవయ్యా నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.