TG-3951
Telugu

నీవే నా స్నేహమ

Neeve Naa Snehamu

20
views
పల్లవి

నీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము నీవే ఆధారము – నీవే నా ఆనందము నీ ప్రేమ నాలో పదిలము నీలోనే సాక్ష్యమే సంతోషము (2) సర్వోన్నతుడా నీకే మహిమ పరమ తండ్రి నీకే ఘనత (2) ||నీవే||

1వ చరణం

నా జీవితాంతం నిన్నే పొగడెదను నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే (2) నా దేవుని మందిరములో నివసించెదను నా స్తుతి నైవేద్యం నీకే అర్పించెదను – (2) ||సర్వోన్నతుడా||

2వ చరణం

నా బలహీన స్థితిలో గతివి నీవైతివే నా కన్నీరు నాట్యముగా మార్చినది నీవే (2) కృంగిన నా హృదయమును లేవనెత్తితివి అసాధ్యమైనది నీకు ఏదియు లేదయా – (2) ||సర్వోన్నతుడా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.