నా(డు వచ్చినట్లు గాదు నేఁడు వచ్చుట తేరి చూడరాదు క్రీస్తు నింకఁ జొత్తు మెచ్చుట ||నా(డు వచ్చినట్లు||
మొదట గొఱ్ఱెపిల్ల రీతి నొదిగి వచ్చెఁగా యిపుడు కొదమ సింహమయ్యె మనకు గుండె దిగులుగా ||నా(డు వచ్చినట్లు||
దాసునివలె దొల్లిఁ జూచినాముగా యిపుడు దోసము లెంచి దండింప దొరయైనాఁడుగా ||నా(డు వచ్చినట్లు||
ఏ తట్టు బోయిన మనకు నెదురు వచ్చెఁగా పిడుగు రీతి వాని యుగ్రమైన దృష్టి హెచ్చఁగా ||నా(డు వచ్చినట్లు||
కొండ వండ లందు డాగి యుండలేముగా వాని యండనుండి మండు నగ్ని యదిగో వచ్చెఁగా ||నా(డు వచ్చినట్లు||
దిక్కుగా నున్నట్లు నితర దేవతలను నమ్మి వట్టి పుక్కిటి పురాణములకుఁ బోయి చెడితిమి ||నా(డు వచ్చినట్లు||
వీధుల బోధించు వారి వినక పోతిమి యిపుడు బాధఁ బొంది నరకాగ్నిలోఁ బడఁబాలైతిమి ||నా(డు వచ్చినట్లు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.