TG-3793
Telugu

నాకై చీల్చబడ్డ యో

Naakai Cheelchabadda

24
views
పల్లవి

నాకై చీల్చబడ్డ యో నా యనంత నగమా నిన్ను దాగి యందున్న చేను మీర బారెడు రక్త జలధారలా శక్తి గ్రోలగా నిమ్ము నేను నాదు శక్తిచే నిన్ను గొల్వజాలను కాల మెల్ల నేడ్చినన్ వేళా క్రతుల్ చేసినన్ నేను చేయు పాపము నేనే బాప జాలను వట్టి చేయి చాచుచున్ ముట్టి సిల్వ జేరెదన్ దిక్కు లేని పాపిని ప్రక్క జేర్చి ప్రోవుము నా కళంక మెల్లను యేసునాథ, పాపుము ఈ ధరిత్రియందున నీరు దాటునప్పుడు నాదరించి నీ కడన్ నాకై చీల్చబడ్డయో నా యనంత శైలమా నన్ను జేర దీయుమా Naa Yanantha Nagamaa Ninnu Daagi Yandhuna Chenu Meera Baaredu Raktha Jaladhaaralaa Shakthi Grolagaa Nimmu Nenu Naadhu Shakthiche Ninnu Golvajaalanu Kaala Mella Nedchinan Vela Krathul Chesinan Nenu Cheyu Paapamu Nene Baapa Jaalanu Vatti Cheyi Chaachuchun Mutti Silva Jeredhan Dikku Leni Paapini Prakka Jerchi Provumu Naa Kalanka Mellanu Yesunaatha, Paapumu Ee Dharithriyandhuna Neru Daatunappudu Naadharinchi Nee Kadan Naa Yanantha Shailamaa Nannu Jera Dheeyumaa

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.