TG-5222
Telugu

నాకంటూ ఈ జగాన నీవే కదా నా యేసయ్య

Naakantoo Ee Jagaana Neevee Kadaa Naa Yeesayya

0
views
పల్లవి

నాకంటూ ఈ జగాన – నీవే కదా నా యేసయ్య జీవించెద నీ కోసమే – చావైతే నిన్ను చేర ఆశయా నా ప్రభువా – ఎంత ప్రేమయా ఊహించలేనయా నాపై నీకున్న దయ ఆశల వలయాలు నను చుట్టుకొనగా – కొనఊపిరితో నే పడి ఉండగా నీ చేతితో నను లేపినావు – నీ ప్రాణమిచ్చి నను కొన్నావు ఎంత ప్రేమయా నా యేసయ్య – ఊహించలేనయా నీ అడుగులలోనే నా ఈ పయనం నీ సిలువ చెంతనే సేద తీర్చుకొందును ఎన్నో ఇక్కట్లు కన్నీటి కష్టాలు నీ కృపలో ఉందునయా ఎంత ప్రేమయా – ఊహించలేనయా (నా మంచి యేసయా)