TG-3327
Telugu

నాకేమీ కొదువ నా యేసుడుండ

naakeemee koduva naa yeesudunda

పాస్టర్ కే జాకబ్ జాన్ · Pastor K Jacob Johnకల్పనా · Kalpana
0
views
Chorus

నాకేమీ కొదువ నా యేసుడుండ (2) నే నడిచెదను నా ప్రియుని తోడ పాడెద నేను తనివితీరా - చాటెద నేను వేయినోళ్ల (2) ||నాకేమీ||

1వ చరణం

కొదువ కలవే సింహపు పిల్లలు లోటు లేదే నా జీవితానా - చింతపడను సిగ్గుపడను నా అండ నా కొండ నా యేసు ఉండ ||నాకేమీ||

2వ చరణం

పచ్చిక బయలులో పరుండెదను శాంతి సౌదములో సంచరించెద - మేలుతో హృదయం తృప్తి పొంద నా గిన్నె నిండి పొరులుచు నుండ ||నాకేమీ||

3వ చరణం

ఎన్ని మేలులో అన్నా నాకు అన్నీ కృపలే ఆశ్చర్యములే - చెప్పనసక్యము మహిమాయుక్తము ఆనందమే నాకు ఆనందమే ||నాకేమీ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.