నాకెన్నో మేలులు చేసితివే
Naakenno Melulu Chesithive
నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును (2) హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే (2) ||నాకెన్నో||
కృప చేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో – నను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే (2) ||హల్లెలూయా||
నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే (2) ||హల్లెలూయా||
నా కాడి మోసి నా తోడు నీవే నీ చేతి నీడలో – నను దాచియున్నావే ఏ కీడు నాకు రాకుండ చేసి నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2) ||హల్లెలూయా||
నీ రాజ్యమందు నను చేర్చుకొందువు రానున్న రారాజువు – నా రాజువు నీవు నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు నను కొన్నవాడవు – నా వరుడవు నీవు (2) ||హల్లెలూయా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.