TG-5223
Telugu

నాకు చాలిన దేవుడ నీవు నా కోసమే మరణించావు

Naaku Chaalina Deevuda Neevu Naa Koosamee Maraninchaavu

21
views
పల్లవి

నాకు చాలిన దేవుడ నీవు నా కోసమే మరణించావు (2) నా శ్రమలలో నా ఆధారమా నను ఎడబాయని నా దైవమా (2) ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను ఏ రీతిగా నిను స్తుతియించగలను (2) ||నాకు చాలిన||

1వ చరణం

వధకు సిద్ధమైన గొరియపిల్ల వోలె మౌనివై నా పాప శిక్షణోర్చినావు (2) అన్యాయపు తీర్పుతో దోషిగ నిను చేసినా (2) చిరునవ్వుతో సిలువనే భరించినావయ్యా (2) ||ఏమిచ్చి||

2వ చరణం

ఎండిన భూమిలో లేత మొక్క వోలె నా శ్రమలను భరియించి నలుగగొట్టబడితివా (2) సూదంటి రాళ్ళలో గొల్గొతా దారిలో (2) నడవలేక సుడి వడి కూలినావయ్యా (2) ||ఏమిచ్చి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.