TG-5228
Telugu

నాకున్న ఆధారమా యేసయ్య నీతోనే ఉండాలని

Naakunna Aadhaaramaa Yeesayya Neethoonee Undaalani

19
views
పల్లవి

నాకున్న ఆధారమా యేసయ్య నీతోనే ఉండాలని నాలోని ఆనందమా యేసయ్య నీకై జీవించాలని భయమే లేదు ఇక దిగులే లేదు నీ తోడు నాకుండగా భయమే లేదు ఇక దిగులే లేదు నీవే నా అండగా వందనము యేసయ్య నీకే వందనము యేసయ్య (2) ||నాకున్న||

1వ చరణం

పలుమార్లు  నేను పడిపోతిని లేవలేక నీ జాడను వెదకితిని కన్నీటి ఊబిలో పడిఉండగా నా చేయి పట్టి నన్ను హత్తుకుంటివి ఏమున్నా నీతోనే ఉంటా ఏమీలేకున్నా నీవే నా తండ్రివి (2) ||వందనము||

2వ చరణం

నీ సన్నిదే నాకు పెన్నిధి అని కష్టాలలో ఆదరించునని నీ దివ్య కాంతి నీ నేను చూడగా ఒప్పుకుంటిని నా దోషములను పరిశుదాత్మను నే పొందుకొవాలని ప్రతిదినము నీతో గడిపెదనయ్యా నా కన్నిటితో నీ పాదాలను తడపాలనీ హృదయముతో నిన్నే ఆరాధింతును ||వందనము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.