♪♫
TG-5229
Telugu
నాకున్న బలము సరిపోదయ్యా
Naakunna Balamu Saripoodayyaa
0
views
పల్లవి
నాకున్న బలము సరిపోదయ్యా నాకున్న జ్ఞానము సరి కాదయ్యా (2) ఆత్మతో నింపి అభిషేకించు (నీ) శక్తితో నింపి నను నడిపించు (2) ||నాకున్న||
1వ చరణం
నిన్ను విడిచి లోకంలో సౌలు వలె తిరిగాను నిన్ను మరచి యోనాలా నిద్రలో మునిగాను (2) ||ఆత్మతో||
2వ చరణం
మనసు మారి పౌలు వలె నిన్ను చేరుకున్నాను మనవి ఆలకించమని పెనుగులాడుచున్నాను (2) ||ఆత్మతో||
3వ చరణం
అనుమానంతో నేను తోమలా మారాను అబ్రాహాములా నీతో ఉండగోరుచున్నాను (2) ||ఆత్మతో||