♪♫
TG-3802
Telugu
నాకున్నది నీవేనని
Naakunnadi Neevenani
0
views
పల్లవి
నాకున్నది నీవేనని నను కన్నది సిలువేనని (2) నీవున్నది నాలోనని నేనున్నది నీకేనని సాక్ష్యమిచ్చెద యేసయ్యా నీ సాక్షిగా బ్రతికించుమయ్యా ||నాకున్నది||
1వ చరణం
గుడ్డివాడను నేనేనని నీ చూపు ప్రసాదించేవని (2) చెవిటి వాడను నేనేనని నీ వినికిడి నేర్పించేవని ||సాక్ష్యమిచ్చెద||
2వ చరణం
మూగవాడను నేనేనని నీ మాటలు పలికించేవని (2) అవిటివాడను నేనేనని నీ నడకలు నేర్పించేవని ||సాక్ష్యమిచ్చెద||