నాపైన చూపించే నీ ప్రేమ వాత్సల్యము
Naapaina Choopinchee Nee Preema Vaathsalyamu
నాపైన చూపించే నీ ప్రేమ వాత్సల్యము విలువెంతో వివరించ గలనా నా కొరకే దిగివచ్చి నా శిక్షను భరియించిన నీ ప్రేమ వర్ణించగలనా ధరలోన ఎవ్వరు చూపలేని ప్రేమతో నిలువెల్ల పులకించితి దేవా స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డను మరచినా నేను నిన్ను మరువనన్న దేవా చూడుము అరచేతిలో నిన్ను చెక్కియున్నానని మాట ఇచ్చి ప్రేమ చూపినావు అనుదినము నాపైన నూతన వాత్సల్యము చూపించ నాదెంత భాగ్యం తప్పిపోతినయ్య తండ్రియైన నిను వీడి తడబడెను నా జీవిత నావ తప్పులన్ని క్షమియించ తనయుడనే కాదయ్య తండ్రీ నే పాపినని వేడగా తరగని నీప్రేమతో తరియింప జేయుటకు తండ్రీ నాదెంత భాగ్యం ఎగసి పడే అలలు ఎదురైన పయనం లో ఏసయ్య నీవుండగ నా దోనెలో నశియించు చున్నాను నజరేయా కరుణించని నాధా నిను వేడుకున్న వేళ గాలిని గద్దించి నిమ్మళింపజేసావే నా దేవ నాదెంత భాగ్యం
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.