♪♫
TG-3810
Telugu
నాతో నీవు మాట్లాడినచో
Naatho Neevu Maatlaadinacho
15
views
పల్లవి
నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ నీ ప్రేమలోతు చవిచూపించు నిన్నే సేవించెదన్ నీ ప్రేమనుండి నన్నెవ్వరు వేరుచేయరూ నీ ప్రేమయందే నేను సంతసించెదన్ యేసయ్యా నీవే నా ఆధారం (4) శ్రమయైనా బాధయైనా వ్యధయైనా ధుఖఃమైనా కరువైనా ఖడ్గమైనా హింసయైనా యేదైనా క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్ యేసయ్యా నీవే నా ఆధారం (4) జీవమైనా మరణమైనా దూతలైనా ప్రధానులైనా ఉన్నవియైనా రాబోవునవైనా యెత్తైనా లోతైనా క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్ యేసయ్యా నీవే నా ఆధారం (4) ||నాతో నీవు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.