నాతో మాట్లాడుమయ్యా నన్నూ దర్శించుమయ్యా
Naathoo Maatlaadumayyaa Nannoo Darshinchumayyaa
నాతో మాట్లాడుమయ్యా - నన్నూ దర్శించుమయ్యా నీ మందిరాన నీ సన్నిధాన - నీ ఆత్మతో నన్ను నింపూమయా ||నాతో||
యేసయ్యా...ఆ..ఆ.. యేసయ్యా...ఆ..ఆ.. యేసయ్యా...ఆ..ఆ.. యేసయ్యా... యేసయ్యా (2) కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకు నను చేర్చుమయ్యా కరువు తోడైనా - కలిమి వేరైనా - కరుణించి కాపాడుమయ్యా నా వేదనలో నీ జాలితో నా శోధనలో నీ చేతితో నిత్యము నను నడిపించుమయ్యా ||యేసయ్యా||
నావారే నన్ను నిందించువేళ - నను విడచి పోబోకుమయ్యా ఆదరణ నాకు కరువైనవేళ - దరిచేరి ఓదార్చుమయ్యా నా నిందలలో నా తోడువై - అపనిందలలో నా చేరువై నిత్యము నను నడిపించుమయ్యా ||యేసయ్యా||
నా కాలు జారి తొట్రిల్లువేళ - చేజాచి నిలబెట్టుమయ్యా సాతాను నన్ను బంధించువేళ - ననుచేరి విడిపించుమయ్యా నీ చేతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో నిత్యము నను నడిపించుమయ్యా ||యేసయ్యా||
Album : Talachukunte Chalunayya (తలచుకుంటే చాలనాయా)