TG-147
Telugu

నాయేసు నామ శబ్దము ఎంతో

naayeesu naama shabdamu enthoo

202
views
పల్లవి

నాయేసు నామ శబ్దము ఎంతో యింపైనది భయాదులెల్ల దీరిచి విశ్రాంతి నిచ్చును.

1వ చరణం

ఆకలిగొన్న యాత్మకు అదే మన్నాయగు ప్రయాసపడ్డవారికి ఫలము నిచ్చును. ||నాయేసు నామ||

2వ చరణం

ఈ ప్రియమైన నామము నిరీక్షణిచ్చును నాదుర్గమైన స్థానము కృపానిలయము. ||నాయేసు నామ||

3వ చరణం

నా యేసు దివ్యనామము సుక్షేమ నిధియౌ నా దిక్కులేని యాత్మకు సమృద్ధినిచ్చును. ||నాయేసు నామ||

4వ చరణం

యేసూ నీవే నాకాపరి నా రక్షకా, రాజా, నా ప్రభువా, నా జీవమా! నా స్తుతి పొందుము. ||నాయేసు నామ||

5వ చరణం

నీ ప్రేమ ప్రకటింతును నా చావు వరకు నీ నామ సంకీర్తనము నన్నాదరించును. ||నాయేసు నామ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.