TG-3813
Telugu

నడిపించు నా నావా

Nadipinchu Naa Naavaa

0
views
పల్లవి

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు||

1వ చరణం

నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు||

2వ చరణం

రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||

3వ చరణం

ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు||

4వ చరణం

ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు||

5వ చరణం

లోటైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు||

6వ చరణం

ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||