♪♫
TG-5078
Telugu
నడిపించుచున్నాడు నజరేయుడు
Nadipinchuchunnaadu Najareeyudu
0
views
పల్లవి
నడిపించుచున్నాడు - నజరేయుడు నడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడు గాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనా కష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా ||నడిపించు||
1వ చరణం
1. నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా (2) అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి (2) ఊసుచెప్పినాడు - బాసచేసినాడు (2) ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ||నడిపించు||
2వ చరణం
2. ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా (2) చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి (2) ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు (2) ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా ||నడిపించు||