TG-1085
Telugu

నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడు

nadipisthaadu naadeevudu shramaloonainaa nanu viduvadu

201
views
పల్లవి

నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడినా అలసట పైబడినా చేయితట్టి వెన్నుతట్టి చక్కని ఆలొచన చెప్పి (2)

1వ చరణం

అంధకారమే దారి మూసినా - నిందలే నను కృంగదీసినా తనచిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు ||నడిపిస్తాడు నాదేవుడు||

2వ చరణం

కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా తనచిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు ||నడిపిస్తాడు నాదేవుడు||

3వ చరణం

నాకున్న కలిమి కరిగిపోయిన - నాకున్న బలిమి తరిగిపోయిన తనచిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు ||నడిపిస్తాడు నాదేవుడు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.