♪♫
TG-5082
Telugu
నడ్పుమా మహా యెహోవా లోకయాత్ర యందున
Nadpumaa Mahaa Yehoovaa Lookayaathra Yanduna
0
views
పల్లవి
1. నడ్పుమా మహా యెహోవా - లోకయాత్ర యందున నీదు శక్తి నాకు దిక్కు - నన్ రక్షంప జేపట్టు దివ్యమన్నా దివ్యమన్నా - నా కాహారమై యుండు 2. ఊటగా స్వచ్ఛజలంబు - బండనుండి పారనీ అగ్ని మేఘ స్తంభాలచే - నడవిన్ నన్ దాటించు గొప్ప ప్రాపూ గొప్ప ప్రాపూ - నాకు డాలు నీవే 3. యోర్దాన్ నది దాటువేళ - భీతులెల్ల బాపుము మృత్యు శ్రమలన్ని నన్ను - క్షేమ కానాన్ జేర్చును స్తుతిగీతి స్తుతిగీతి - నీ కర్పింతు నిత్యము