TG-5081
Telugu

నడువలేని వేళలో ఎండినా ఎడారిలో

Naduvaleeni Veellaloo Endinaa Edaariloo

11
views
పల్లవి

నడువలేని వేళలో ఎండినా ఎడారిలో నీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ.. దారితెలియని యాత్రలో గాలిసంద్రపు అలలలో నీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ.. ||నడువలేని||

1వ చరణం

1.  అలలతో నీవు కొట్టబడినా నడిసంద్రములో చిక్కుబడినా (2) చెంతచేరి చెయ్యిచాపి జీవమిచ్చి నిలుపునుగా విడువనీ ప్రేమతో లేవనెత్తి నడుపునుగా (2) ||నడువలేని||

2వ చరణం

2.  శ్రమలలో నీవు కృంగిపొయినా ఆప్తులంతా దూరమైన (2) ఆధరించి సేదధీర్ఛి హృదయవంచలు తీర్చునుగా మరువనీ ప్రేమతో నిత్యము నిను నడుపునుగా (2) ||నడువలేని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.