నజరేయుడా నాయేసయ్యా - ఎన్నియుగాలకైనా
najareeyudaa naayeesayyaa - enniyugaalakainaa
🎵 TG-1084🌐 Telugu
పల్లవి
నజరేయుడా నాయేసయ్యా - ఎన్నియుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని - గళమెత్తి నీకీర్తి నే చాటెద
1వ చరణం
ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం - నీకే వందనం (2) ||నజరే||
2వ చరణం
ఆగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి జలములలో బడి నేవెళ్ళినా - నన్నేమి చేయవు నాయేసయ్యా నీకే వందనం - నీకే వందనం (2) ||నజరే||
3వ చరణం
సీయోను శిఖరాగ్రము - నీ సింహాసనమాయెనా సీయోనులో నిన్ను చూడాలని - ఆశతో ఉన్నాను నాయేసయ్యా నీకే వందనం - నీకే వందనం (2) ||నజరే||