♪♫
TG-3815
Telugu
నజరేయుడా నా యేసయ్య
Najareyudaa Naa Yesayya
0
views
పల్లవి
నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||
1వ చరణం
ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2) శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
2వ చరణం
అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) జలములలోబడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
3వ చరణం
సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2) సీయోనులో నిను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||