TG-5124
Telugu

నలిగిన నా బ్రతుకులో ఎన్నో శోధనలు

Naligina Naa Brathukuloo Ennoo Shoodhanalu

0
views
పల్లవి

నలిగిన నా బ్రతుకులో - ఎన్నో శోధనలు ఇరుకులు ఇబ్బందులు - నను కృంగజేయునప్పుడు పాపపు శాపము - నను వెంటాడినపుడు శత్రువు ఉచ్చుకు - నేను బంధినైనప్పుడు దేవా నీవే సహాయము చేయువడవు నాకు దేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ లోకములో (2) వేదన బాధతో నే ఒంటరైనప్పుడు బ్రతుకు మీద ఆశలే నే కోల్పోయినప్పుడు ఓదార్పు కరువై నే ఏడ్చినప్పుడు శత్రువే నను చూసి నవ్వినప్పుడు దేవా నీవే సహాయము చేయువడవు నాకు దేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ లోకములో ఎవరున్నారు దేవా ఎవరున్నారు నాకు నీవు తప్ప ఈ లోకములో ఎవరున్నారు (2) దేవా నీవే సహాయము చేయువడవు నాకు దేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ లోకములో దేవా నీవే సమాధానము కలుగజేయువాడవు దేవా నీవు తప్ప ఎవరూ నాకు ఈ లోకములో దేవా నీవే ఆరోగ్యము నిచ్చువాడవు నాకు దేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ లోకములో దేవా నీవే ఆశీర్వాదము కలుగజేయువాడవు దేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ లోకములో