♪♫
TG-5126
Telugu
నలుగకుండ గోధుములు కడుపు నింపగలుగునా
Nalugakunda Goodhumulu Kadupu Ninpagalugunaa
17
views
పల్లవి
నలుగకుండ గోధుములు - కడుపు నింపగలుగునా కరగకుండ కొవ్వొత్తి - కాంతి నివ్వగలుగునా ఆత్మీయ యాత్రలో - నలుగుటయే విలువయా ఇరుకైన బాటలో - కరుగుటయే వెలుగయా పగలని బండనుండి - జలములు ఊరునా విరుగని పొలము మనకు - పంటలీవ్వగలుగునా పరలోకయాత్రలో - పగులుటయే ఫలమయా విశ్వాసి బాటలో విరుగుటయే వరమయా ||నలుగ||
1వ చరణం
రక్తము చిందకుండ - పాపములు పోవునా కన్నీరు కార్చకుండ - కలుషములు కరుగునా అంతిమ యాత్రలో - క్రీస్తేసే గమ్యమయా ఏకాంత బాటలో - ప్రభు యేసే శరణమయా ||నలుగ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.