TG-3404
Telugu

నమ్మదగని ఈ మనుష్యులలో ప్రధాన దోషిని నేనయ్య

nammadagani ee manushyulaloo pradhaana dooshini neenayya

Daniel Johnప్రకాష్ · PrakashBRO.PRAKASH GARU · Prakash
0
views
Chorus

నమ్మదగని ఈ మనుష్యులలో ప్రధాన దోషిని నేనయ్య ఎన్నిమార్లు నను నమ్మిననూ నీ విలువను ఎరుగని పశువునయ నమ్మీ చేరదీసినా మునుపటి స్వభావమేనయ్య మిగిలివున్న నా దినములకు భయము నేర్పుము యేసయ్య

1వ చరణం

కష్టము కలిగిన ప్రతిసారి గుండెభారమై పిలిచానయ్య బాధపోయిన మరుక్షణం నీ గుండెకు గాయం చేశానయ్య కీడు చేయుటకు అలవాటై మేలు చేయటం మరిచాను మచ్చలు పోగొట్టుకోలేని చిరుతపులికి సరిపోయాను నీ సారెపైన నిర్మించి నీ పరిచారకునిగ చేసావు

2వ చరణం

స్నేహము నేర్పిన ఆశలతో సమస్తమూ రుచిచూసానయ్య నలుగురిలో నా డంబమును అత్యధికముగా చూపానయ్య భక్తి ముసుగునే ధరియించి రాజకీయమే చేసాను సౌమ్యప్రదర్శన చేయుచూ దుర్మార్గమంతటిని దాచాను నీకృపను నాపై చూపించి నీ వారసునిగ చేసావు

3వ చరణం

ప్రేమను పంచిన వారిపై కత్తుల మాటలు విసిరానయ్య మంచి చెప్పిన ఇతరులను నీ అర్హతేమిటని అడిగానయ్య దూలమున్నదని తెలిసినా నీతి సూక్తులే పలికాను నీతిమంతులూ ఎవరనుచూ దుర్నీతి పనులలో మునిగాను నీ ఆత్మతో వెలిగించి నీ సాధనముగ చేసావు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.