నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును
Nammakamaina Naa Prabhu Ninnu Nee Sthuthinthunu
నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును ||నమ్మకమైన||
కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడిన స్థిరపరచి కాపాడిన స్థిరపరచిన నా ప్రభున్ పొగడి నే స్తుతింతును (2) ||నమ్మకమైన||
ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు మన్ననతోడ నీ దరిన్ చేర్చి నన్ క్షమించితివి (2) ||నమ్మకమైన||
కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి భంగ పర్చు సైతానున్ గెల్చి విజయమిచ్చితివి (2) ||నమ్మకమైన||
నా కాశ్రయశైలమై – కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి ప్రాకారంపు ఇంటివై నన్ను దాచియుంటివి (2) ||నమ్మకమైన||
సత్య సాక్షివై యుండి – నమ్మదగినవాడవై నమ్మదగినవాడవై నిత్యుడౌ మా దేవుడా ఆమేనంచు పాడెద (2) ||నమ్మకమైన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.