నమ్మకు ఇలలో ఎవరిని సాయం
nammaku ilaloo evarini saayam
నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని (2) నమ్ముకో రక్షకుడేసుని కార్యం చూడు నిలుచొని (2) ||నమ్మకు||
సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనే మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే నీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి జవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటి సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.