నమ్మరె నరులార యేసుని సమ్మతిగాఁ

nammare narulaara yeesuni sammathigaam

🎵 TG-296💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నమ్మరె నరులార యేసుని సమ్మతిగాఁ జేరి నమ్మిన వారల నిమ్ముగ బ్రోచును సొమ్ముగ తను జేర్చి ||నమ్మరె నరులార||

1వ చరణం

యేసు క్రీస్తుకంటెఁ పోషకు లెవ్వరు లేరుసుమీ దోషుల తన దాసులుగాఁ దీసియు దోసముఁ బాపు సుమీ ||నమ్మరె నరులార||

2వ చరణం

నరకము నొందక మీ రయ్యో నరకము బాధ సుమీ న్యాయము కాదుసుమి నరులార నష్టము మీకు సుమీ ||నమ్మరె నరులార||

3వ చరణం

తండ్రి కొమరుఁడు విమ లాత్ముఁడు త్ర్యేకదేవుండు తండ్రి వలెను మనలను పాలించును తండ్రిగ నమ్ముదము ||నమ్మరె నరులార||

4వ చరణం

ధరణిలో నొకఁడైన చూడరె ధన్యుడు లేఁడనుచు దీర్ఘదర్శి దావీదు తెల్పె నిటు దీనుల కందఱికి ||నమ్మరె నరులార||

5వ చరణం

ప్రభు మన పాపముకై ప్రాణము బలిగా నిచ్చునుగా పాపము మోసెను మృతియై లేచెను పాపులఁ బ్రోచుటకై ||నమ్మరె నరులార||

6వ చరణం

దేవసుతుని రక్తం అబ్బిన ద్రోహుల కతిప్రొయము పావన మొనరించును పాపికి నిఁక జీవనమై యుండున్ ||నమ్మరె నరులార||

Report Error