TG-1086
Telugu

నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మీ

nammi nammi manussyulanu neevu nammi nammee

206
views
పల్లవి

నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మీ పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు ఇలా... ఎంత కాలము... నీవు సాగిపోదువు...

1వ చరణం

రాజులను నమ్మి - బహుమతిని ప్రేమించినా బిలాము ఏమాయెను? - దైవదర్శనం కోల్పోయెను నాయేసయ్యను నమ్మిన యెడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే ||నమ్మినమ్మి||

2వ చరణం

ఐశ్వర్యము నమ్మి - వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెను? -అగ్నికి ఆహుతి ఆయెను నాయేసయ్యను నమ్మిన యెడల ( యెహోషువ 7:21,26 ) మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే ||నమ్మినమ్మి||

3వ చరణం

సుఖ భోగము నమ్మి - ధనాపేక్షతో పరుగెత్తిన గెహజీ ఏమాయెను? - రోగమును సంపాదించెను నాయేసయ్యను నమ్మిన యెడల ( 2రాజులు 5:26,27 ) శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే ||నమ్మినమ్మి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.