TG-5121
Telugu

నమ్మిరమ్ము నమ్మిరమ్ము ఇమ్ముగ బ్రతుకుము

Nammirammu Nammirammu Immuga Brathukumu

0
views
పల్లవి

1.  రక్షణంపు వార్తను విని - రక్షకుండగు యేసుని పిల్పుకు లోబడెదవా - అలయక యేసును జూతువా పల్లవి: నమ్మిరమ్ము నమ్మిరమ్ము - ఇమ్ముగ బ్రతుకుము నమ్మిరమ్ము నమ్మిరమ్ము - ఇమ్ముగ బ్రతుకుము 2.  వేసవి కాలమెల్ల గడిపి - కోతల ననుభవించితి వేసవి వర్షమును చూచితివి - ఇంక పాపమందున్నావే 3.  యేసు నీ తీర్మానముకై - వేచియుండగా తీర్మానించు ఆత్మ పోరాడుచున్నప్పుడే - అప్పగించుకో ప్రక్కజూచి 4.  తగుదునా యని యను కొనక - వేరు స్పర్శల నొందకుము తలంపు కాదు నమ్మికయే - ఆత్మ ముద్రనిచ్చును 5.  చిత్తము దేవదత్తముజేయ - ప్రాయశ్చిత్త రక్తము నమ్ము నాకమందుండు యేసుని చూడు - మారని వాక్యమును చేరుము 6.  యెషయా ఒకటి పదునెమ్మిది - నలభై ఐఫు ఇరవై రెండును యేసు అరచి చెప్పుదాని - ఆయనన్ కూడ పొందుము 7.  యిర్మియా ఎన్మిదిరవైయును - రెండవ కొరింథీ ఆరు రెండును కార్యములు నాలుగు పండ్రెండును - పొంది హల్లెలూయ పాడుమా