TG-5120
Telugu

నమ్మితి నయ్యా యేసయ్యా నీ పాదములే

Nammithi Nayyaa Yeesayyaa Nee Paadamulee

19
views
పల్లవి

నమ్మితి నయ్యా యేసయ్యా నీ పాదములే నమ్మితి నయ్యా యేసయ్యా నమ్మితి నయ్య నా నెమ్మదిలో నిన్ను నిమ్ముగఁ గృప నాపైఁ గుమ్మరిం చుము వేగ ||నమ్మితి||

1వ చరణం

1.  పాప భార మనెడు మోపు మోయఁగ లేక కాపు నీవె యని నీ దాపు జేరిన నేను ||నమ్మితి||

2వ చరణం

2.  ఆపత్కాలమునందుఁ బ్రాపు నీవని వేఁడఁ గాపాడి రక్షించు కరుణాసముద్రుఁడ ||నమ్మితి||

3వ చరణం

3.  ఎన్ని తప్పులు నాలో నున్న నీ దయ చేత మన్నించి రక్షించు మహిత దేవ కుమార ||నమ్మితి||

4వ చరణం

4.  దాసుని మొఱ నీవు వేసారక విని వాసిగా రక్షించు పరమ జనక నన్ను ||నమ్మితి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.