TG-088
Telugu

నమో యేసునాధా నాధా నమో

namoo yeesunaadhaa naadhaa namoo

198
views
పల్లవి

నమో యేసునాధా నాధా నమో జీవనాధా సమాన విరహిత సనాతనాత్మా సమున్నతోజ్వల ప్రశాంత ధామా ||నమో యేసునాధా||

1వ చరణం

స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగ భూ వలయాకాశంబుల మించుచు భువన పాలనముజేసెటి ప్రభువా ||నమో యేసునాధా||

2వ చరణం

ధరణీ మానవ విమోచనార్థము కరుణను జీవము లొసగిన ప్రభువా పరమ కృపాభరితా మృతసారా వరసజ్జన హృదయాబ్జ విహారా ||నమో యేసునాధా||

3వ చరణం

సుందర మలయజ గంధ ధూపముల చందముననుమా వినుతులు గొను మా వందే దేవ దయాసందీప వందే శుభదానంద స్వరూపా ||నమో యేసునాధా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.