TG-2964
Telugu

నన్నెంతగానో నీవు కోరావుగా

nannentagaanoo neevu kooraavugaa

Pranam Kamlakharజాషువు షైక్ · Joshua Shaikఆనంద్ / చైత్ర అంబడిపూడి · Anand / Chaitra Ambadipudi
35
views
Chorus

నన్నెంతగానో నీవు కోరావుగా బ్రతుకంత నాకు తోడై ఉన్నావుగా రచించావు నన్ను నీవు క్షమించావు నన్ను నీవు నీ ప్రేమ చాలు నాకు నా యేసయ్య. ||నన్నెంతగానో||

1వ చరణం

ఏముంది ఈ జగాన - ఎదురీత సాగరాన   నా జీవ నావ నీవే నా యేసయ్య తీరాలే దూరమైన - కనుమేర చీకటైన ఏ భయము లేదు నాకు నీవుండగా అలజడులే రేగినా - అధికారం నీదనీ  అనుదినము నీ కృపా  - స్తుతియించి పాడనీ  ప్రియమైన యేసయ్య - నడిపించు నన్నిలా ||నన్నెంతగానో ||

2వ చరణం

ఊహించలేను దేవ నీవు లేని జీవితాన్ని   ఓ నిమిషమైన నేను మనలేనుగా  నాలోని ఆశ నీవే - ఎదలోని ధ్యాస నీవే నీ పాదసేవకేగ ఈ జీవితం ఆణువణువు నీవనీ- ఇహమందు పాడనీ  కడవరకు సాక్షిగా - కలకాలం సాగనీ  ప్రియమైన యేసయ్య - కరుణించు నన్నిలా ||నన్నెంతగానో ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.