TG-3828
Telugu

నన్నెంతగానో ప్రేమించిన

Nannenthagaano Preminchina

0
views
పల్లవి

నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2) నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును (2) నా యవ్వనమంతా… నా జీవితమంతా (2) ||నన్నెంతగానో||

1వ చరణం

ధరలోని మన్నుతో సమమైన నన్ను ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2) అన్నీ నీవే నాకై సమకూర్చినావు ఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2) వాక్యపు మన్నాతో పోషించిన నన్నే ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే ||నిన్నే||

2వ చరణం

దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2) మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు (2) పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో మరణపు విల్లును విరచిన దేవా నీలో ||నీలో||