TG-5097
Telugu

నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా

Nannu Pilichina Deevaa Nannu Muttina Prabhuvaa

22
views
పల్లవి

నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా (2) నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే (2) నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా (2) యేసయ్యా ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2) బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప (2) నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||

1వ చరణం

నేనని చెప్పుటకు నాకేమి లేదు సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు (2) అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2) నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.