TG-5097
Telugu

నన్ను పిలిచిన దేవా (నీ కృపయే కావలెను)

nannu pilichina deevaa (nee krupayee kaavalenu)

Benny Joshuaపాస్టర్ బెన్నీ జాషువు · Pastor Benny Joshuaపాస్టర్ బెన్నీ జాషువు · Pastor Benny Joshua
24
views
పల్లవి

నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా (2) నే జీవించునది నీ కృప ఎదుగించునది నీ కృప హెచ్చుంచునది నీ కృప మాత్రమే (2)

పల్లవి పూర్వ భాగం

నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా (2) యేసయ్యా…

1వ చరణం

ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2) బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప (2) నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||

2వ చరణం

నేనని చెప్పుటకు నాకేమి లేదు సామర్ధ్యము అనుటకు నాకని ఏమి లేదు (2) అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2) నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.