TG-5102
Telugu

నన్ను సృజియించిన ఆదేవుడు ఎక్కడ ఉన్నాడో

Nannu Srujiyinchina Aadeevudu Ekkada Unnaadoo

0
views
పల్లవి

నను సృజియించిన ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో అని ఊరువాడ చెట్టుపుట్ట అన్నీ వెదికాను (2) సృష్టినే దేవుడని - నేను పూజించాను సృష్టికర్తను మరచి - నేనెంతో వగచాను ||నను||

1వ చరణం

వెదకిన దేవుడు దొరకక పోగా - నేనే దేవుడని సరిపెట్టుకున్నాను (2) రక్తము కార్చినవాడే దేవుడని (2) తెలిసిన క్షణమున సిలువను చేరితి ||నను||

2వ చరణం

మత చట్రములో దేవుని బంధించి - విదేశీయతను క్రీస్తుకు ఆపాదించి(2) నిజ రక్షకుని అంగీకరించక (2) నిష్టగ నరకాన చేరుట న్యాయమా? (2) నను సృజియించిన ఆ దేవుడు - యేసులో ఉన్నాడు అని ఊరు వాడ పల్లె వెళ్ళి తిరిగి చెబుతాను (2) Album : Nee Krupa Chaalunaya (నీ కృప చాలునయా)