TG-5101
Telugu

నన్ను విడిపించినా నన్ను రక్షించినా

Nannu Vidipinchinaa Nannu Rakshinchinaa

0
views
పల్లవి

నన్ను విడిపించినా - నన్ను రక్షించినా నన్ను క్షమియించినా - నన్ను కరుణించినా నా యేసుకే స్తోత్రము - నా క్రీస్తుకే వందనము ||నన్ను||

1వ చరణం

పాపపు సంకెళ్ళచేత - బంధించ బడియున్న నన్ను చూచి నన్ను చేరి - విడిపించిన దైవమా నీకే స్తోత్రం - నీకే స్తోత్రం - నీకే స్తుతిస్తోత్రం ||నన్ను||

2వ చరణం

పాపపు పొడలచేత కన్నుమిన్ను కానకున్న నన్నుగాంచి వెల చెల్లించి - రక్షించిన నా దైవమా నీకే స్తోత్రం - నీకే స్తోత్రం - నీకే స్తుతిస్తోత్రం ||నన్ను||