నన్నుఁ గన్నయ్య రావె నా యేసు
Nannun Gannayya Raave Naa Yeesu
నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||
ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను (2) పొందికగా జేయరావే నా డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను||
హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి (2) మొద్దులతో నింక కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||
కాలము పెక్కు గతించెను గర్వాదు లెడదెగవాయెను (2) ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను||
దారుణ సంసార వారధి దరి జూపి ప్రోవ నీ కన్నను (2) కారణ గురువు లింకెవ్వరు లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||
నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని (2) దీవించి రక్షింపనిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.