నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా
Nanu Peeru Petti Pilichinadi Neevee Kadaa
నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా నా చేయి పట్టి నడిపితివి నీవే సదా పనికి రాని నన్ను నీ పాత్రగా మలచుటకు యుగయుగములు నీతో నే జీవించుటకు నిను నీవే నాకు బయలు పరచుకుంటివి నీ రక్షణ మార్గములోనికి నన్ను నడుపుచుంటివి ||నను పేరు||
తల్లి గర్భమందు నే రూపింపబడక మునుపే నీదు ప్రేమ జీవగ్రంథమందు నన్ను నిలిపే (2) ఎంతగా కరుణించితివో నీ నామము ఎరుగుటకు ఏ అర్హత చూసితివో నీ ప్రేమను పొందుటకు (2) ||నను పేరు||
ఈ జగతికి పునాదులు వేయకన్నా ముందుగా నీ తలపులలో నేను నిలిచి యుంటి నిండుగా (2) నీదు ప్రేమ అవసరము నాకుందని గుర్తించి నీ ముద్రను వేసితివి సిలువలో నను రక్షించి (2) ||పనికి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.