నర జన్మమెత్తి వరసుతునిగా అరుదెంచె

nara janmameththi varasuthunigaa arudenche

🎵 TG-1955🌐 Telugu
పల్లవి

నర జన్మమెత్తి వరసుతునిగా అరుదెంచె నేడు సరసముగా శ్రీ వేల్పుడగు ఆనందమూర్తి క్రీస్తేసు స్వామి ఈ భువిలోన మానసవేది పావనమూర్తి మానవులను పాలించుకర్త నర జన్మమెత్తి… లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ మెత్తి కన్య మరియ గర్భవతియాయే (2)    || మానసవేది||

1వ చరణం

బంతి యనగ యాడరే మన బాల చిన్న ముద్దుల యేసుకు (2) ముత్తిక తోడ కూడి యాడి ముద్దుల పరుడు పల్క పరుడు గ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స ప ద ని స.. ప ద ని స.. ప ద ప ద గ మ గ మ గ రి స రి ||బంతి||

2వ చరణం

జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి (2)       ||ముత్తిక||

3వ చరణం

జననము నొందెను జయ యేసు జయ గీతములు పాడుడి (2) ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గొర్రెల కాపరులకు దూత గొప్ప వార్తను తెలిపినట (2)        ||జననము||

4వ చరణం

శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయక బేత్లెహేమ యూరిలో సత్రమందున పశువుల శాలయందున దేవపుత్రుండు మనుజుండాయెనందున (2)          ||శ్రీ యేసుండు||

5వ చరణం

చూడబోదాము రారే సకల జనంబులార శ్రీ యేసు నాథుని జన్మంబు ఆనందముతో మనమందరం ఆహ ||చూడబోదాము||

6వ చరణం

ఘల్లు ఘల్లున మనమెల్లి యేసుని పాదంబు జంబులకు మ్రొక్కెదము (2)       ||ఆనందముతో||

7వ చరణం

ఆహ చూడ… ఆహ చూడ… ఆహ చూడబోదాము రారే

Report Error