నరకమనునది నిరంతముండునయో ఆ ఘోరనరకము
narakamanunadi niranthamundunayoo aa ghooranarakamu
నరకమనునది నిరంతముండునయో ఆ ఘోరనరకము నందు పాపులు బాథపడుదురయో మరియు నగ్ని పురుగులందున కొరుకు చుండును తరుగులేకను ధరణికాదిది దరియుకాదు మరణమెదకిన దొరకదందున ||నరకమనునది నిరంతముండునయో||
గప్పు గప్పున రగులుచుండునయ్యో ఆ ఘోరనరకము నిప్పులెగయుచు పొంగుచుండునయ్యో మబ్బువలె పొగ పైకిలేచును అబ్బా! అబ్బాని యేడ్చుచుందురు బొబ్బలిడు దురు అడ్డమొచ్చెడి అబ్బలెవరు కానరందున ||నరకమనునది నిరంతముండునయో||
నోరులెత్తి కొట్టుకొందురయ్యో ప్రభు యేసు క్రీస్తును నమ్మనందుకు నొచ్చుకొందురయ్యో పురుగు చావదు అగ్ని ఆరదు కొరుకుచుందురు పండ్లు పట పట తిరిగితిరిగి చూచుచుందురు పరుగులెత్తక యేడ్చు చుందురు ||నరకమనునది నిరంతముండునయో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.