TG-5129
Telugu

నశియించెడి లోకంలో వసియించవు కలకాలం

Nashiyinchedi Lookanloo Vasiyinchavu Kalakaalan

0
views
పల్లవి

నశియించెడి లోకంలో – వసియించవు కలకాలం మేలైనది చేపట్టి – సాగించు నీ పయనం (2) అది నాదంటూ ఇది నాదంటూ – ఆనందం కోల్పోతూ పరమార్ధం గ్రహియించకనే – గతియించిపోతావా ||నశియించెడి||

1వ చరణం

కాలంతో పాటుగా కృశియించును శరీరం మరణం కబళించును ఏ ఘడియలోనైనా (2) క్రీస్తు దారిలో సాగి – నిత్య రాజ్యమే చేరి (2) వసియించు కలకాలం – సత్యమైన లోకంలో ||నశియించెడి||

2వ చరణం

నిలచిపోవును మహిలోన బంధాలన్ని మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో (2) ఇకనైనా తేరుకొని – గ్రహియించు సత్యాన్ని (2) యేసులోకి మళ్ళించు – నీ జీవిత గమనాన్ని ||నశియించెడి||