నష్టము నంతటిని మరల మా యేసునిలో ఆర్జించితిమి
Nashtamu Nanthatini Marala Maa Yeesuniloo Aarjinchithimi
1. ఆనందించెదము - ప్రభు యేసులో - అంతయు మరలార్జించు కొంటిమి ఆదాము నుండి పోయిన దెల్లయు - అనుభవించు చున్నామిప్పుడు పల్లవి: నష్టము నంతటిని మరల - మా యేసునిలో ఆర్జించితిమి ఎల్లప్పుడు జీవితమతయు హల్లెలూయ పాడెదము 2. దావీదువలె అంత నష్టపడితిమి - దుఃఖపడి బహుగా ఏడ్చితిమి దావీదువలె ప్రభుని వెదకగ - తిరిగి ఆర్జించుకొంటిమి 3. పూర్వము నైక్యము లేకపోయెను - పేదలమై యుంటిమి అపుడు మనలను ఖాళీ చేసికొనగా - మరల నొందితిమి పూర్ణత 4. మొదటి ప్రమను కోల్పోతిమిల - వ్యర్థమైనట్టి ప్రేమనొందితిమి పొందితిమి యేసు ప్రభువులో - నిండుగను దైవ ప్రేమను 5. దేవుని కల్గియుండకుంటిమి - దైవసమాధాన మొందకుంటిమి పాపములలో మరణించియుంటిమి - పరమజీవ మొందితిమి 6. నిరీక్షణయేమి లేక యుంటిమి - నరకమున కర్హులమై యుంటిమి ఘనుడగు యేసు నంగీకరింపగా - నన్నును విమోచించెను 7. పాపము వలనెంతో నష్టపోతిమి - ప్రభులో సకలము సంపాదించితిమి శాపమునందు చుట్టబడితిమి - సర్వమొందెదము మరల