♪♫
TG-3842
Telugu
నే సాగెద యేసునితో
Ne Saageda Yesunitho
22
views
పల్లవి
నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2) యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2) పరమును చేరగ నే వెళ్లెద (2) హనోకు వలె సాగెదా ||నే సాగెద||
1వ చరణం
వెనుక శత్రువులు వెంటాడిననూ (2) ముందు సముద్రము ఎదురొచ్చినా (2) మోషె వలె సాగెదా ||నే సాగెద||
2వ చరణం
లోకపు శ్రమలు నన్నెదిరించినా (2) కఠినులు రాళ్ళతో హింసించినా (2) స్తెఫను వలె సాగెదా ||నే సాగెద||
3వ చరణం
బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2) క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2) పౌలు వలె సాగెదా ||నే సాగెద||
4వ చరణం
తల్లి మరచిన తండ్రి విడచిన (2) బంధువులే నన్ను వెలివేసినా (2) బలవంతుని వలె సాగెదా ||నే సాగెద||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.