♪♫
TG-3843
Telugu
నే స్తుతించెదను
Ne Sthuthinchedan
0
views
పల్లవి
నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను ||నే స్తుతించెదను||
1వ చరణం
ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింప నెవ్వరికి తరమౌనా? (2) పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమనపారముగా (2) ||నే స్తుతించెదను||
2వ చరణం
పాపములన్నియు బాపుటకై శాపములన్నియు మాపుటకై (2) ఏ పాపమెరుగని ఆ పావనుడు శాపగ్రాహియై చావొందెను (2) ||నే స్తుతించెదను||
3వ చరణం
శోధన కాలముల యందున వేదన కాలముల యందున (2) నాధుడు యేసు మనతోడనుండ అంతమేగా మన చింతలకు (2) ||నే స్తుతించెదను||
4వ చరణం
ఎనలేని ప్రేమతో కౌగిలించెను ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను (2) మహామహుండు మహిమ ప్రధానుడు మహిమతో వచ్చును మేఘముపై (2) ||నే స్తుతించెదను||
5వ చరణం
రాజాధిరాజు ప్రభు యేసే దేవాదిదేవుడు మన యేసే (2) పరమందు దూతలు యిహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా (2) ||నే స్తుతించెదను||