♪♫
TG-3847
Telugu
నేడో రేపో నా ప్రియుడేసు
Nedo Repo Naa Priyudesu
0
views
పల్లవి
నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలమీద ఏతెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు మహీ స్థలమునకు ఏతెంచును ||నేడో రేపో||
1వ చరణం
చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతినీయడు (2) నక్షత్రములు రాలిపోవును ఆకాశ శక్తులు కదిలిపోవును (2) ||నేడో రేపో||
2వ చరణం
కడబూర స్వరము ధ్వనియించగా ప్రియుని స్వరము వినిపించగా (2) వడివడిగ ప్రభు చెంతకు చేరెద ప్రియమార ప్రభుయేసుని గాంచెద (2) ||నేడో రేపో||
3వ చరణం
నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు (2) హల్లెలూయా స్తుతిగానాలతో నిత్యం ఆనందమానందమే (2) ||నేడో రేపో||