♪♫
TG-3850
Telugu
నీ ఆనంద తైలముతో
Nee Aananda Thailamutho
24
views
పల్లవి
నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా (2) తడిసెదను.. నీ జీవనదిలో (2) తడిసి తడిసి ఆనందించెదా (2) ||నీ ఆనంద||
1వ చరణం
వీడిపోయెను నా పాప సంకెళ్లు నన్ను తొలగిపోయెను నా శాపపు కట్లు (2) దైవమా.. నీవే ఇచ్చావు రక్షణ (2) నే మరువగలనా నీ మంచి ప్రేమ (2) ||నీ ఆనంద||
2వ చరణం
నీ ఆత్మ నాకు తోడుండగా కానెన్నడు కాను ఒంటరిని (2) ప్రేమా ప్రవాహం ఉంచావే నాలోన (2) నే మరువగలనా నా హృదయములో (2) ||నీ ఆనంద||
3వ చరణం
నే దాటిపోదును దేశ సరిహద్దులు ప్రకాశించెద చీకటి లోకంలో (2) జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా (2) నన్ను వాడుకొనుమా నీ దివ్య సేవలో (2) ||నీ ఆనంద||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.