TG-5271
Telugu

నీ ఆవరణమందున నిలిచే ధన్యత పొందిన

Nee Aavaranamanduna Nilichee Dhanyatha Pondina

21
views
పల్లవి

నీ ఆవరణమందున నిలిచే ధన్యత పొందిన (2) ఏర్పరచబడిన నీ పిల్లలం (2) నిలోన ఎదిగి ఫలియించేదం (2) నీ మందిరము యొక్క సమృద్ధితో (2) సంతృప్తినొందుచు జీవించేదం (2) ||నీ||

1వ చరణం

ఈ మందిరము నిండుకొనియున్నది అసమానమైన నీ తేజస్సుతో (2) సన్మానించెదము పూర్ణాత్మతో (2) మా మధ్య నీవుంచిన నీ మందిరమును నీ మందిరమును ||నీ మందిరము||

2వ చరణం

ఈ మందిరము వైపు నీ కన్నులు తెరచియున్నవి రేయింబగలు (2) సంతోషించెదము నీ మేళ్లతో (2) నివసించి నీవిచ్చిన నీ మందిరములో నీ మందిరములో ||నీ మందిరము||

3వ చరణం

ఈ మందిరము కట్టబడియున్నది నీ నామ ఘనతకు మహనీయుడా (2) సంభాషించెదము నీ క్రియలను (2) నీవే ప్రతిష్టించిన నీ మందిరమున నీ మందిరమున ||నీ మందిరము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.